కార్తీక మాసం శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్తీక మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రముఖ శైవక్షేత్రాలకు (Karthika Masam 2024) వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర కార్తీ మాసం సందర్భంగా టీజీఆర్టీసీ (TGSRTC) ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రసిద్ధ శైవక్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను (TGSRTC Special Buses) ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.
...