ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య బీమా ఎంత అవసరం? అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మారిన జీవన ప్రమాణాలు, పెరుగుతున్న కాలుష్యం, పుట్టుకొస్తున్న వైరస్‌లు.. అన్నీ కలిసి అనారోగ్య సమస్యల వలయంలోకి అందర్నీ నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ కొండంత ధైర్యమే. అందుకే అంతా ఆరోగ్య బీమాకు (Health Insurance) ఇంతలా ప్రాధాన్యాన్నిస్తున్నారు.
...