Representational Image (File Photo)

Mumbai, JAN 13: ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య బీమా ఎంత అవసరం? అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మారిన జీవన ప్రమాణాలు, పెరుగుతున్న కాలుష్యం, పుట్టుకొస్తున్న వైరస్‌లు.. అన్నీ కలిసి అనారోగ్య సమస్యల వలయంలోకి అందర్నీ నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిజంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కొండంత ధైర్యమే. అందుకే అంతా ఆరోగ్య బీమాకు (Health Insurance) ఇంతలా ప్రాధాన్యాన్నిస్తున్నారు. అయితే పెరుగుతున్న క్లెయిముల్లో ఎక్కువగా తిరస్కరణకు గురవుతుండటం కనిపిస్తున్నది. వీటన్నింటినీ పరిశీలించిన బీమా రంగ రెగ్యులేటర్‌ ఐఆర్‌డీఏఐ.. కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం.

L&T Chairman S.N.Subrahmanyan: ఇంట్లో కూర్చుని భార్యని ఎంతసేపు చూస్తారు, ఆదివారం కూడా ఆఫీసుకు రండి, ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ వ్యాఖ్యల వీడియో వైరల్ 

గత ఏడాది పాలసీదారుల ప్రయోజనాల రక్షణార్థం ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (IRDAI) తెచ్చిన మార్గదర్శకాలు.. డాక్యుమెంటేషన్‌ అవసరాలను చాలా సులభతరం చేసింది. దీంతో పాలసీదారులపై అనవసరపు పత్రాలను సమీకరించే భారం తగ్గిందని చెప్పవచ్చు. అయినప్పటికీ కావాల్సిన డాక్యుమెంట్లు లేవని బీమా సంస్థలు మీ ఆరోగ్య బీమా క్లెయిమ్‌ను తిరస్కరిస్తే.. ఏం చేయాలో ఐఆర్‌డీఏఐ తమ మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నది. క్లెయిమ్‌లో మీకున్న న్యాయపరమైన హక్కులనూ తెలియజేసింది.

EPFO Withdrawal From ATM Soon: ఇకపై ఏటీఎం నుంచి కూడా పీఎఫ్‌ విత్‌డ్రా చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది..ఎలా పనిచేస్తుందంటే.. 

వాటిలో కావాల్సిన డాక్యుమెంట్లు లేవని, లేదా క్లెయిమ్‌ ఆలస్యమైందన్న కారణంతో బీమా సంస్థ పాలసీదారుల అభ్యర్థనను తిరస్కరించరాదు.

ఒకవేళ క్లెయిమ్‌ను తిరస్కరిస్తే బీమా కంపెనీలు అందుకుగాను లిఖితపూర్వక వివరణను పాలసీదారులకు ఇవ్వాలి. క్లెయిమ్‌ నిరాకరణకు బీమా సంస్థ చూపిన కారణాలు పాలసీ నిబంధనలకు లోబడే ఉన్నాయా? అని పాలసీదారులు తెలుసుకోవచ్చు. తద్వారా తప్పిదాలను సరిదిద్దుకోవచ్చు.

నేరుగా క్లెయిమ్‌కు కావాల్సిన ప్రధాన డాక్యుమెంట్లను మాత్రమే బీమా సంస్థలు పాలసీదారుల నుంచి కోరవచ్చు. పాలసీని జారీ చేసేటప్పుడు ప్రామాణిక సూచనల్ని తప్పక చేయాలి.

పాలసీదారులు మర్చిపోయిన పత్రాలను గుర్తుచేయడంలో బీమా కంపెనీలు సహాయం చేయాలి. ఆలస్యం లేకుండా క్లెయిమ్‌ పరిష్కారమయ్యేలా చూడాలి.

అరకొర పత్రాలు, సమర్పించిన డాక్యుమెంట్లలో తప్పులున్నాయన్న కారణంగా బీమా సంస్థలు క్లెయిమ్‌ల ఆలస్యం, తిరస్కరించడం చేయరాదు.

సాధారణంగా క్లెయిమ్‌కు కావాల్సిన పత్రాలేవి?

దవాఖాన బిల్లులు, రశీదులు

డిశ్చార్జి సమ్మరీలు

డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌

ట్రీట్‌మెంట్‌ రికార్డులు

ఎక్స్‌-రేలు, రక్త నమూనాలు, ఇతరత్రా పరీక్షల నివేదికలు

క్లెయిమ్‌ ఫారం, పాలసీ కాపీ

క్లెయిమ్‌ పరిష్కారంలో బీమా సంస్థ పనితీరు నిరాశాజనకంగా, అభ్యంతరకరంగా ఉంటే.. సదరు బీమా కంపెనీ ఫిర్యాదుల పరిష్కార విభాగానికి పాలసీదారులు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదును అందుకున్న 15 రోజుల్లోగా బీమా సంస్థలు దాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేసినప్పుడు మీకు లభించే రశీదుతో అది ఏ దశలో ఉందన్నది కూడా పాలసీదారులు తెలుసుకోవచ్చు. తద్వారా మీ కైంప్లెంట్‌ను ట్రాకింగ్‌ చేయవచ్చు. ఒకవేళ బీమా సంస్థ సమాధానం మిమ్మల్ని సంతృప్తిపర్చకపోతే.. ఐఆర్‌డీఏఐ ‘బీమా భరోసా’ వెబ్‌సైట్‌ను కూడా సంప్రదించవచ్చు. అయినప్పటికీ న్యాయం జరుగలేదని భావిస్తే.. ఇన్సూరెన్స్‌ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు.