New Delhi, JAN 04: ఈపీఎఫ్ ఖాతాదారులకు (EPFO) బిగ్ అప్‌డేట్. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్క్రైబర్లలో ఏడు కోట్ల మంది కోసం కోసం రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. ఇకపై ఈపీఎఫ్ఓ ఖాతాదారులు త్వరలో సెటిల్‌మెంట్ తర్వాత నేరుగా ఏటీఎంల నుంచి తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఏడాది మే-జూన్ నాటికి కొత్త ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మొబైల్ యాప్, డెబిట్ కార్డ్ సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ చందాదారులకు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
ఈపీఎఫ్ఓ అత్యాధునిక సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను 2025 ఏడాది జూన్ నాటికి (EPFO 3.0)ను ప్రవేశపెడుతుందని మంత్రి మాండవియా పేర్కొన్నారు. నివేదికల ప్రకారం.. ఈపీఎఫ్ఓ 3.0 ప్రవేశపెట్టిన తర్వాత ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులకు ఏటీఎం కార్డులను కూడా అందజేస్తుందని మాండవ్య వెల్లడించారు.
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలకు దీటుగా కొత్త సిస్టమ్ సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. అలాగే వెబ్‌సైట్ ఇంటర్‌ఫేస్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మొత్తం ఐటీ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడంతో కూడిన ఈపీఎఫ్ఓ 2.0 అప్‌గ్రేడ్ ప్రస్తుతం జరుగుతోందని, జనవరి చివరి నాటికి పూర్తవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సవరించిన పీఎఫ్ విత్‌డ్రా మార్గదర్శకాలతో ఈపీఎఫ్ సభ్యులు త్వరలో ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డ్‌ని ఉపయోగించి వారి ఈపీఎఫ్ నిధులను వేగంగా విత్ డ్రా చేసుకోవచ్చు.
ఈ ప్లాన్ కింద ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్‌లు తమ సేవింగ్స్ విత్‌డ్రా చేసేందుకు ఏటీఎం కార్డు మాదిరి ప్రత్యేక కార్డ్‌లను అందుకుంటారు.
కొత్త సిస్టమ్ క్లెయిందారులు, లబ్ధిదారులు లేదా బీమా చేసిన వ్యక్తులు తమ క్లెయిమ్ మొత్తాలను ఏటీఎంల ద్వారా యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తుంది.
ఈపీఎఫ్ఓ ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద మరణించిన చందాదారుల వారసులకు గరిష్టంగా రూ. 7 లక్షలు అందుకోవచ్చు.
కొత్త విధానం ప్రకారం.. మరణించిన ఈపీఎఫ్ఓ చందాదారుల వారసుడు కూడా క్లెయిమ్ సెటిల్‌మెంట్ తర్వాత డబ్బును విత్‌డ్రా కోసం ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చని కేంద్ర కార్మిక కార్యదర్శి సుమితా దావ్రా పీటీఐకి తెలిపారు.
ప్రస్తుతం ఈపీఎఫ్ఓ చందాదారులు ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం 7 రోజుల నుంచి 10 రోజులు వేచి ఉండాలి. ప్రస్తుతం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు తమ క్లెయిమ్‌లను ఆన్‌లైన్‌లో పరిష్కరించేందుకు 7 నుంచి 10 రోజులు వేచి ఉండాలి. సెటిల్‌మెంట్ అనంతరం లబ్ధిదారుల బ్యాంకు అకౌంటుకు నగదు బదిలీ అవుతుంది.
కేంద్రీకృత పెన్షన్ పవ్యవస్థ (CPPS) అన్ని ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాలలో పూర్తిగా విస్తరించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ లాంచ్‌ను ‘చారిత్రక మైలురాయి’గా అభివర్ణించారు.
“ఈ చొరవతో దేశంలోని ఏ బ్యాంక్, ఏ బ్రాంచ్ నుంచి అయినా, పెన్షనర్లు తమ పెన్షన్‌లను సులభంగా యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తుంది. ఫిజికల్ వెరిఫికేషన్ విజిటింగ్ అవసరం ఉండదు. పెన్షన్ పంపిణీ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది” అని మాండవ్య చెప్పారు.
ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డ్‌ని పొందిన చందాదారులు తమ మొత్తం కంట్రిబ్యూషన్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉందని గమనించడం ముఖ్యం. అయితే, సానుకూల అంశం ఏమిటంటే.. ఈ పరిమితిలోపు ఉపసంహరణలకు గతంలో మాదిరిగానే ఈపీఎఫ్ఓ నుంచిముందస్తు అనుమతి అవసరం లేదు. ప్రభుత్వం ఈ చొరవతో ఈపీఎఫ్ఓ చందాదారులకు ఎంతో ప్రయోజనాన్ని అందిస్తుంది. గజిబిజిగా ఫారమ్-ఫిల్లింగ్ భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరాన్ని తొలగిస్తుంది.