Mumbai, JAN 02: స్టాక్ మార్కెట్ ఆపరేటర్ కేతన్ పరేఖ్, మరో ఇద్దరిపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI) నిషేధం విధిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నది. 2000లో జరిగిన స్టాక్ మార్కెట్ కుంభకోణంలో (Stock Market Scam) కేతన్ పరేఖ్ (Ketan Parekh) భాగస్వామిగా ఉన్నట్లు తేలడంతో సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న రోహిత్ సాల్గావోకర్, అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ (FPI) లు ఈ కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్నట్లు తేలింది. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఎఫ్‌పీఐ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. 22 మంది వ్యక్తులు, సంస్థలు 2000 నాటి కుంభకోణం వల్ల రూ.65.77 కోట్ల చట్ట విరుద్ధ లాభాలు గడించారని సెబీ తన 188 పేజీల తాత్కాలిక ఆదేశాల్లో పేర్కొంది.
సదరు వ్యక్తుల, సంస్థల 22 బ్యాంకు ఖాతాల నుంచి ఏ ఒక్కరికీ రుణాలివ్వకుండా వాటిని ఫ్రీజ్ చేసింది. కేతన్ పరేఖ్, రోహిత్ సాల్గావోకర్ కలిసి రెండేండ్ల పాటు స్టాక్ మార్కెట్లలో కుంభకోణానికి పాల్పడ్డారని సెబీ నివేదికలో తేలింది. 2000 స్టాక్ మార్కెట్ కుంభకోణానికి కారణమైన కేతన్ పరేఖ్‌ను 14 ఏండ్ల పాటు మార్కెట్లలో ట్రేడింగ్ నుంచి నిషేధిస్తూ ఇంతకు ముందు సెబీ ఆదేశించింది. కోల్ కతా కేంద్రంగా వేర్వేరు సంస్థల ద్వారా కేతన్ పరేఖ్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించాడని రోహిత్ సాల్గావోకర్ సమాచారం ఇచ్చాడు.
అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఎఫ్‌పీఐతోపాటు లావాదేవీలు జరిపేందుకు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్, నువమా వెల్త్ మేనేజేమెంట్ సంస్థలతో రిఫరల్ అగ్రిమెంట్ కలిగి ఉన్నట్లు సాల్గావోకర్ తెలిపారు. 2024 జూన్ నెలలో ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి సెబీ అధికారులు 17 చోట్ల తనిఖీలు చేపట్టి దర్యాప్తుచేసింది.