ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), స్మార్ట్ వేరబుల్స్ విభాగాల్లో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తూ టెక్ దిగ్గజం 'మెటా' తన వార్షిక 'మెటా కనెక్ట్' వేదికగా సంచలనాత్మక ప్రకటనలు చేసింది. కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సాంకేతిక ప్రపంచాన్ని ఆకట్టుకునేలా కొత్త తరం స్మార్ట్ గ్లాసెస్, అత్యంత తేలికైన వీఆర్ (VR) గ్లాసెస్ , అధునాతన 'మ్యూస్ (Muse)' ఏఐ ఏజెంట్‌ను ఆవిష్కరించారు.
...