Meta Connect 2026: కెమెరా లేని స్మార్ట్ గ్లాసెస్‌ నుంచి కొత్త VR గ్లాసెస్ వరకు.. మెటా కనెక్ట్‌లో అతిపెద్ద ప్రకటనలు ఇవే..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), స్మార్ట్ వేరబుల్స్ విభాగాల్లో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తూ టెక్ దిగ్గజం 'మెటా' తన వార్షిక 'మెటా కనెక్ట్' వేదికగా సంచలనాత్మక ప్రకటనలు చేసింది. కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సాంకేతిక ప్రపంచాన్ని ఆకట్టుకునేలా కొత్త తరం స్మార్ట్ గ్లాసెస్, అత్యంత తేలికైన వీఆర్ (VR) గ్లాసెస్ , అధునాతన 'మ్యూస్ (Muse)' ఏఐ ఏజెంట్‌ను ఆవిష్కరించారు.

Meta Connect 2026: కెమెరా లేని స్మార్ట్ గ్లాసెస్‌ నుంచి కొత్త VR గ్లాసెస్ వరకు.. మెటా కనెక్ట్‌లో అతిపెద్ద ప్రకటనలు ఇవే..
Meta Connect 2026 Announcements

Meta Connect 2026: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), స్మార్ట్ వేరబుల్స్ విభాగాల్లో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తూ టెక్ దిగ్గజం 'మెటా' తన వార్షిక 'మెటా కనెక్ట్' వేదికగా సంచలనాత్మక ప్రకటనలు చేసింది. కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సాంకేతిక ప్రపంచాన్ని ఆకట్టుకునేలా కొత్త తరం స్మార్ట్ గ్లాసెస్, అత్యంత తేలికైన వీఆర్ (VR) గ్లాసెస్ , అధునాతన 'మ్యూస్ (Muse)' ఏఐ ఏజెంట్‌ను ఆవిష్కరించారు.

మెటా తన పాపులర్ స్మార్ట్ గ్లాసెస్‌లో మూడవ తరం మోడల్ అయిన Ray-Ban Meta Gen 3ని ప్రవేశపెట్టింది. ఇవి బడ్జెట్ శ్రేణిలో $249 (సుమారు రూ. 21,000) నుంచి లభిస్తాయి. మెరుగైన ఆడియో కోసం 6 మైక్రోఫోన్లు, డోల్బీ అట్మాస్ (Dolby Atmos) స్పాషియల్ ఆడియో , సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ వీటి ప్రత్యేకతలు. ఇవి యుఎస్ ఎఫ్‌డిఏ (FDA) ఆమోదించిన హియరింగ్ ఎయిడ్‌గా కూడా పనిచేస్తాయని మెటా ప్రకటించింది. దీనివల్ల స్వల్ప వినికిడి లోపం ఉన్నవారికి ఎంతో మేలు చేకూరనుంది. అలాగే కెమెరా లేకుండా, కేవలం ఆడియో , ఏఐ ఫీచర్లతో పనిచేసే 'రే-బాన్ మెటా ఆడియో' గ్లాసెస్‌ను కూడా మెటా తొలిసారిగా పరిచయం చేసింది.  మీ పేరుతో SIM ఉందా.. అది వేరొకరికి ఇస్తున్నారా జాగ్రత్త.. రూ.50 లక్షల ఫైన్, 3 ఏళ్ల జైలు తప్పదంటున్న DoT..

సాంకేతికపరంగా మెటా తన సరికొత్త Muse AI మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది కేవలం సమాధానాలు ఇవ్వడమే కాకుండా, వినియోగదారుల తరఫున సొంతంగా పనులు పూర్తి చేస్తుంది. వాల్‌మార్ట్, ఇన్‌స్టాకార్ట్, షాపిఫై వంటి ప్రముఖ యాప్‌లతో అనుసంధానమై యూజర్ల ఆదేశాల మేరకు షాపింగ్ చేయడం, టికెట్లు బుక్ చేయడం వంటి సేవలను మ్యూస్ ఏఐ స్వయంగా నిర్వహిస్తుంది. మ్యూస్ వాయిస్ ఫీచర్ ద్వారా మనకు నచ్చిన రీతిలో మాట్లాడే ఏఐ స్వరాన్ని కూడా ఎంచుకోవచ్చు.

Mete Connect 2026

ఈ వేదికపై మరొక ప్రధాన ఆకర్షణగా నిలిచింది కొత్త Meta VR Glasses. పాత Quest 3 హెడ్‌సెట్‌తో పోలిస్తే ఇది 5 రెట్లు తక్కువ బరువు (సుమారు 100 గ్రాములు) కలిగి ఉండి, అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. $1,299 ధరకు అందుబాటులోకి వచ్చే ఈ పరికరం మొదటి 'IMAX Enhanced Certified' వర్చువల్ రియాలిటీ సాధనంగా గుర్తింపు పొందింది. ఇది డిస్నీ+, ఎక్స్‌బాక్స్ క్లౌడ్ గేమింగ్ వంటి ప్లాట్‌ఫామ్‌లతో అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

దీనితో పాటు మణికట్టుకు ధరించే 'న్యూరల్ బ్యాండ్' ఆధారంగా చేతి సైగలతోనే గ్లాసెస్‌లోని డిస్ప్లేను నియంత్రించే సాంకేతికతను మెటా అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరిస్తోంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు లైవ్ నేవిగేషన్ రూట్లను నేరుగా కళ్ల ముందే ప్రదర్శించే సదుపాయం ఇందులో ఉంది. స్మార్ట్‌ఫోన్ల స్థానాన్ని ఏఐ గ్లాసెస్ భర్తీ చేసే భవిష్యత్తు దిశగా మెటా కనెక్ట్ వేదిక స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

(The above story first appeared on LatestLY on Sep 24, 2026 09:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).