ప్రముఖ మొబైల్ దిగ్గజం మోటరోలా తన ఫ్లిప్ సైడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా రేజర్ 50 ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో విడుదల చేసింది. 6.9 అంగుళాల ఇంటర్నల్ స్క్రీన్, 3.63 అంగుళాల కవర్ డిస్ ప్లేతో ఈ ఫోన్ వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ఎస్వోసీ, అల్యూమినియం ప్రేమ్ తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తోంది.
...