ప్రముఖ మొబైల్ దిగ్గజం మోటరోలా తన ఫ్లిప్ సైడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా రేజర్ 50 ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో విడుదల చేసింది. 6.9 అంగుళాల ఇంటర్నల్ స్క్రీన్, 3.63 అంగుళాల కవర్ డిస్ ప్లేతో ఈ ఫోన్ వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ఎస్వోసీ, అల్యూమినియం ప్రేమ్ తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తోంది. 4200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ పొందుపర్చారు. ఎయిర్‌టెల్ పండగ ఆఫర్లు పై ఓ లుక్కేసుకోండి, అదనపు డేటాతో పాటుగా, ఓటీటీ సదుపాయాలు
మోటరోలా రేజర్ 50 ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.64,999గా ఉంది. ఈ నెల 20 నుంచి అమెజాన్, రిలయన్స్ డిజిటల్, సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం అవుతాయి. బీచ్ శాండ్, కోలా గ్రే, స్ప్రిట్జ్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. ప్రారంభ ఆఫర్ గా రూ.5000 ఫెస్టివ్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటుగా రూ.10 వేల బ్యాంకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇక రూ.2778 నుంచి ఈఎంఐ ఆప్షన్ ప్రారంభం అవుతుంది. రిలయన్స్ జియో నుంచి రూ.15 వేల విలువైన బెనిఫిట్లు పొందొచ్చు.
మోటరోలా రేజర్ 50 ఫోన్ ఫీచర్లు
ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెల్లో యూఎక్స్ వర్షన్
120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు,
413 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ
6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2640 పిక్సెల్స్) పోలెడ్ ఇన్నర్ డిస్ ప్లే
300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్
3.63 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1056×1066 పిక్సెల్స్) పోలెడ్ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎక్స్ చిప్ సెట్,
8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ,
డ్యుయల్ ఔటర్ కెమెరా సెటప్ (50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా,
13 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా),
ఇన్నర్ డిస్ ప్లేలో సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా
5జీ, బ్లూటూత్ 5.4, జీపీఎస్,
ఎఫ్ఎం రేడియో, ఏ-జీపీఎస్, ఎల్టీఈపీపీ,
గ్లోనాస్, గెలీలియో, యూఎస్బీ టైప్ సీ పోర్ట్,
వై-ఫై 802.11 ఏ/ బీ/ జీ /ఎన్ /ఏసీ/ ఏఎక్స్ కనెక్టివిటీ