ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ టర్బో 4 (Redmi Turbo4) ఫోన్‌ను గురువారం చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400-ఆల్ట్రా చిప్‌సెట్‌తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది. 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6550 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
...