Redmi Turbo 4 Launched

New Delhi, JAN 02: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ టర్బో 4 (Redmi Turbo4) ఫోన్‌ను గురువారం చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400-ఆల్ట్రా చిప్‌సెట్‌తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది. 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6550 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 బేస్డ్ షియోమీ హైపర్ ఓఎస్ 2.0 స్కిన్ ఆన్ టాప్ వర్షన్ పై పని చేస్తుంది. త్వరలో భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్ ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. 1.5కే ఓలెడ్ డిస్ ప్లే, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సిస్టమ్‌తో వస్తోందీ ఫోన్.

రెడ్‌మీ టర్బో 4 (Redmi Turbo4) ఫోన్‌ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.23,500 (1999 చైనా యువాన్లు), 16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.25,800 (2199 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.27 వేలు (2299 చైనా యువాన్లు), 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.29,400 (2499 చైనా యువాన్లు) పలుకుతుంది. లక్కీ క్లౌడ్ వైట్, షాడో బ్లాక్, షాలో సీ బ్లూ రంగుల్లో లభిస్తుందీ ఫోన్.

Redmi 14c 5G: లో బడ్జెట్‌లో మరో 5G ఫోన్ లాంచ్ చేస్తున్న రెడ్‌మీ, జనవరి 7న మార్కెట్లోకి రానున్న Redmi 14c 5G మొబైల్  

రెడ్‌మీ టర్బో 4 (Redmi Turbo4) ఫోన్‌ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల 1.5 కే (1220×2712 పిక్సెల్స్) ఓలెడ్ డిస్ ప్లే, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ రేట్, 2560 హెర్ట్జ్ ఇన్ స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్టంగా 3200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్, డోల్బీ విజన్ మద్దతుతో హెచ్డీఆర్10+ కూడా ఉంటుంది. 4ఎన్ఎం ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 – ఆల్ట్రా ఎస్వోసీ ఉంటుంది.

Lava Yuva 2 5G: లావా నుంచి మ‌రో బ‌డ్జెట్ 5జీ ఫోన్ రిలీజ్, కేవ‌లం రూ.9500కే ఎన్నో ఫీచ‌ర్స్ తో ఫోన్ రిలీజ్  

రెడ్‌మీ టర్బో 4 (Redmi Turbo4) ఫోన్‌ 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ-600 ప్రైమరీ రేర్ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 20 మెగా పిక్సెల్ ఓవీ20బీ సెన్సర్ కెమెరా ఉంటాయి. 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6550 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 5జీ, డ్యుయల్ 4జీ ఓల్ట్, వై-ఫై 6, బ్లూటూత్ 6.0, జీపీఎస్, గెలిలియో, గ్లోనాస్, క్యూజడ్ఎస్ఎస్, నేవీల్ సీ, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది.