వ్యాధులు సోకకుండా నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు వ్యాక్సిన్ తీసుకుంటాం. అయితే, టీకా తీసుకోవడానికి సూది వేయడం ఎంతో బాధతో కూడుకున్నది. దీంతో సూది అవసరం లేని, క్రీమ్ లా రాసుకునే సరికొత్త వ్యాక్సిన్ విధానాన్ని అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
...