Newdelhi, Dec 14: వ్యాధులు సోకకుండా నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు వ్యాక్సిన్ (Vaccine) తీసుకుంటాం. అయితే, టీకా తీసుకోవడానికి సూది వేయడం ఎంతో బాధతో కూడుకున్నది. దీంతో సూది అవసరం లేని, క్రీమ్ లా రాసుకునే సరికొత్త వ్యాక్సిన్ విధానాన్ని (Cream Vaccine) అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సాధారణంగా వ్యాక్సిన్ ల వల్ల సాధారణంగా నొప్పి, జ్వరం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ కొత్త విధానం ద్వారా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దాదాపుగా ఉండవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. స్టఫిలోకాకస్ ఎపిడెర్మిడిస్ వంటి సాధారణ చర్మ బ్యాక్టీరియా ఆధారంగా వ్యాక్సిన్ లను శరీరానికి ఇవ్వొచ్చని వీరు ప్రతిపాదిస్తున్నారు.
నాన్న వస్తాడని ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ కూతురు అర్హ (వీడియో)
Goodbye, Needles. Scientists Invented a Vaccine Cream. https://t.co/HXnk3LKchP
— #TuckFrump (@realTuckFrumper) December 12, 2024
ఎలుకలపై ప్రయోగం ఇలా..
ఎలుకలపై తమ కొత్త విధానం పని చేసిందని, ఈ టీకాను ఎలుక చర్మంపై పూయగా, దాని శరీరంలో పెద్ద సంఖ్యలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తర్వాత కోతులపై ఈ పరీక్షలు జరుపుతామని చెప్పారు. భవిష్యత్తులో ఈ విధానం సూది, నొప్పి లేని వ్యాక్సిన్ల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.