Hyderabad, Dec 14: నిన్న రాత్రంతా చంచల్ గూడ జైలులో (Chanchalguda Jail) గడిపి కాసేపటి క్రితమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల (Allu Arjun Released) అయ్యారు. విడుదలైన వెంటనే బన్నీ ఇంటికి వెళ్తారని అంతా భావించారు. అయితే, ఆయన ఎస్కార్ట్ వాహనంతో, భారీ భద్రత నడుమ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు చేరుకున్నారు. అప్పటికే, అక్కడ వేచిఉన్న కొందరు కుటుంబ సభ్యులు ఆయన్ని కలిశారు. అలాగే, సినీ ఫీల్డ్ కు చెందిన దిల్ రాజు, చిన్ని కృష్ణ కూడా ఆఫీసులోనే బన్నీతో మాట్లాడారు. ఇంకా మరికొందరు సినీ ప్రముఖులు కూడా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు, బన్నీ ఇంటికి వెళ్తున్నట్టు సమాచారం.
అల్లు అర్జున్@ ఖైదీ నంబర్ 7697.. జైలు అధికారులు డిన్నర్ ఆఫర్ చేసినా తీసుకోని పుష్పరాజ్..
Here's Video:
జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లిన అల్లు అర్జున్
గీతా ఆర్ట్స్ ఆఫీసుకు చేరుకుంటున్న సినీ ప్రముఖులు
అభిమానులు తరలి రావడంతో జైలు వెనక గేటు నుంచి వెళ్లిపోయిన అల్లు అర్జున్@alluarjun #AlluArjun #AlluArjunArrested #Bigtv pic.twitter.com/WoDt1Jvo0u
— BIG TV Breaking News (@bigtvtelugu) December 14, 2024
అసలేమైంది??
పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, నిన్న ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రంతా జైలులో ఉంచారు.