Hyderabad, Dec 14: నిన్న రాత్రంతా చంచల్ గూడ జైలులో (Chanchalguda Jail) గడిపి కాసేపటి క్రితమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల (Allu Arjun Released) అయ్యారు. విడుదలైన వెంటనే బన్నీ ఇంటికి వెళ్తారని అంతా భావించారు. అయితే, ఆయన ఎస్కార్ట్ వాహనంతో, భారీ భద్రత నడుమ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు చేరుకున్నారు. కాగా, విడుదలైన నాన్న ఎప్పుడు ఇంటికి వస్తారంటూ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ (Allu Arha) ఇంట్లో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Here's Video:
నాన్న వస్తాడని ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ కూతురు అర్హ pic.twitter.com/FjgEYfNf8z
— ChotaNews (@ChotaNewsTelugu) December 14, 2024
నాన్న కోసం అల్లు అర్హ ఎదురుచూపులు
జైలు నుంచి విడుదలై ఇంటికి వస్తున్న అల్లు అర్జున్ కోసం వేచి చూస్తున్న కుటుంబ సభ్యులు@alluarjun #AlluArjun #AlluArjunArrested #Bigtv pic.twitter.com/dVhZ8KtZv3
— BIG TV Breaking News (@bigtvtelugu) December 14, 2024
అసలేమైంది??
పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, నిన్న ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రంతా జైలులో ఉంచారు.
అల్లు అర్జున్@ ఖైదీ నంబర్ 7697.. జైలు అధికారులు డిన్నర్ ఆఫర్ చేసినా తీసుకోని పుష్పరాజ్..