Newdelhi, Dec 2: ఐసీఎస్ఈ (ICSE) పదో తరగతి, ఐఎస్‌సీ (ISC) 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ (Board Exams) నిర్వహించే కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ వచ్చే ఏడాది జరగనున్న సీఐఎస్‌సీఈ (CISCE) పరీక్షల షెడ్యూల్‌ను (Exam Schedule) ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సీఐఎస్‌సీఈ 2023 డేట్ షీట్‌ను cisce.org ద్వారా చెక్ చేసుకోవచ్చు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 29 వరకు ఐసీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు జరగనుండగా, ఫిబ్రవరి 13 నుంచి మార్చి 31 వరకు ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. మే 2023లో ఫలితాలను వెల్లడిస్తారు. వెబ్‌సైట్‌లో పూర్తి షెడ్యూల్ అందుబాటులో ఉందని సీఐఎస్‌సీఈ పేర్కొంది.
పరీక్ష హాలుకు విద్యార్థులు నిర్దేశిత సమయానికి ఐదు నిమిషాల ముందే రావాలని సూచించింది. ఆలస్యంగా వచ్చేవారు అందుకు సరైన కారణం చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. అరగంటకు పైగా ఆలస్యమైతే పేపర్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. అలాగే, ఎగ్జామ్ పూర్తికాకుండా హాలు నుంచి విద్యార్థులను బయటకు పంపరు.
CISCE Announces ICSE Class 10, ISC Class 12 Board Exam 2023 Dates#cisce https://t.co/g1IJ0ZVa5F pic.twitter.com/5Zgj1eoaX2
— NDTV Education (@ndtveducation) December 1, 2022