![](https://test1.latestly.com/wp-content/uploads/2022/07/EXams-declared.jpg?width=380&height=214)
Newdelhi, Feb 9: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి లా కోర్సుల్లో (Law Courses) ప్రవేశాలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం కీలక ప్రకటన చేసింది. లాసెట్ (Lawcet), పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ ను శనివారం విడుదల చేశారు. లాసెట్ కు మార్చి 1 నుంచి, అలాగే, ఈసెట్ కు మార్చి 3 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఇంటర్ విద్యార్హతపై ఐదేళ్ల ఎల్ ఎల్బీ, డిగ్రీ విద్యార్హతపై మూడేళ్ల ఎల్ ఎల్బీ, ఎల్ ఎల్బీ పూర్తయిన వారికి రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్ నిర్వహిస్తారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) పూర్తి చేసిన వారు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్ నిర్వహిస్తారు.
అమెరికా నుంచి తనను వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో తెలుగు విద్యార్థి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే??
ప్రవేశ పరీక్షల దరఖాస్తు షెడ్యూల్ ఇలా..
- టీజీ లాసెట్, పీజీ ఎల్ సెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 25, 2025
- ఆన్ లైన్ దరఖాస్తుల ప్రారంభం మార్చి 1, 2025
- ఆన్ లైన్ దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 15, 2025
- అలస్య రుసుముతో మే 25, 2025
- పరీక్ష తేదీ: జూన్ 6, 2025
ప్రవేశ పరీక్షల దరఖాస్తు షెడ్యూల్ ఇలా..
- టీజీ ఈసెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 25, 2025
- ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం మార్చి 3, 2025
- ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 19, 2025
- పరీక్ష తేదీ: మే 12, 2025