Deportation Fears: అమెరికా నుంచి తనను వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో తెలుగు విద్యార్థి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే??

అమెరికాలో స్థిరపడాలని కలలు కన్నాడు. ఉన్నత విద్యను అక్కడే పూర్తి చేశాడు. అయితే, ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన బహిష్కరణ అస్త్రం అతని పాలిట శాపమైంది. అమెరికా నుంచి తనను ఎక్కడ వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో అక్కడే తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

Deportation Fears: అమెరికా నుంచి తనను వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో తెలుగు విద్యార్థి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే??
Suicide Representative image

Newyork, Feb 9: అమెరికాలో (America) స్థిరపడాలని కలలు కన్నాడు. ఉన్నత విద్యను అక్కడే పూర్తి చేశాడు. అయితే, ట్రంప్ (Trump) తాజాగా తీసుకొచ్చిన బహిష్కరణ అస్త్రం అతని పాలిట శాపమైంది. అమెరికా నుంచి తనను ఎక్కడ వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో అక్కడే తెలుగు విద్యార్థి (Telugu Student) ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. మృతుడి స్నేహితుడి వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న యువకుడి పేరు సాయికుమార్‌ రెడ్డి. ఉన్నత విద్యను అభ్యసించేందుకు న్యూయార్క్ వెళ్లాడు. అక్కడే తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్నాడు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలోని అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్నారు. ఈ క్రమంలోనే సాయికుమార్‌ రెడ్డి పనిచేసే చోట కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఢిల్లీ ప్రజల రుణం తీర్చుకుంటాం, ఇకపై ఆధునిక నగరాన్ని చూస్తారంటూ భరోసా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ఎన్నికల్లో గెలుపై ఇంకా ఏమన్నారంటే?

ఆ భయంతోనే..

సాయికుమార్‌ రెడ్డి పాస్‌ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దీంతో తనను కూడా బహిష్కరిస్తారన్న భయంతో పనిచేస్తున్న చోటే సాయికుమార్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. మృతుడు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికి చెందిన వాడన్న వివరాలు లభ్యం కాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఆపరేషన్ ఢిల్లీ సక్సెస్..విజయ ఢంకా మోగించిన బీజేపీ, 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఎగిరిన కాషాయ జెండా.. సీఎం రేసులో ఉంది వీరే! 

Suicide Prevention and Mental Health Helpline Numbers: 

Men's Helpline Numbers:

Milaap: 9990588768; All India Men Helpline: 9911666498; Men Welfare Trust: 8882498498.

Suicide Prevention and Mental Health Helpline Numbers:

Tele Manas (Ministry of Health) – 14416 or 1800 891 4416; NIMHANS – + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; Peak Mind – 080-456 87786; Vandrevala Foundation – 9999 666 555; Arpita Suicide Prevention Helpline – 080-23655557; iCALL – 022-25521111 and 9152987821; COOJ Mental Health Foundation (COOJ) – 0832-2252525.

(The above story first appeared on LatestLY on Feb 09, 2025 08:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).