Ling Cancer (Credits: X)

Newdelhi, Aug 24: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఊపిరితిత్తుల కేన్సర్ (Lung Cancer) కు బ్రిటన్ పరిశోధకుల బృందం తొలిసారిగా వ్యాక్సిన్ (Vaccine) రూపొందించింది. బీఎన్టీ 116 పేరిట రూపొందించిన ఈ టీకాను యూకేకి చెందిన ఓ ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగిపై ఇటీవల ప్రయోగించారు. వ్యాక్సిన్ పనితీరును పరిశీలిస్తున్నారు. ఒకవేళ టీకా కారణంగా సదరు రోగి వ్యాధి నుంచి విజయవంతంగా కోలుకుంటే.. ఊపిరితిత్తుల కేన్సర్ తో బాధపడుతున్న లక్షలాది మంది ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఏర్పడుతుంది. కీమోథెరఫీ కంటే చాలా కచ్చితత్వంతో ఈ టీకా పని చేస్తుందని వ్యాక్సిన్ యూనివర్శిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. నొప్పి లేకుండా వ్యాధిని నివారించవచ్చన్నారు. ఈ వ్యాక్సిన్ ను బయోఎన్‌టెక్ కంపెనీ రూపొందించింది.

క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన 'గబ్బర్'.. ఎమోషనల్ వీడియో

ఏటా 18 లక్షల మంది..

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణమైన వ్యాధుల్లో కేన్సర్ ముందు వరుసలో ఉంది. వీటిలో ఊపిరితిత్తుల కేన్సర్ వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా 18 లక్షల మంది ఈ ప్రాణాంతకమైన వ్యాధితో మరణిస్తున్నారు.

ఫెమినా మిస్ ఇండియా పోటీల‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు.. మిస్ తెలంగాణగా ప్ర‌కృతి కంభం.. మిస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ గా భ‌వ్యారెడ్డి