భూమికి అతి సమీపంలో ఉండే శుక్రగ్రహం (Venus) ఇప్పుడు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా ఒక వజ్రంలా మెరుస్తూ కనిపిస్తున్నది. సాయంత్రం వేళ సూర్యాస్తమయం తర్వాత దీనిని భూమి మీద నుంచి నేరుగా గమనించవచ్చు. సాధారణంగా శుక్రగ్రహం సూర్యుని మీదుగా లేదా కిందగా వెళ్లినప్పుడు సూర్యకాంతి దాని వాతావరణాన్ని ప్రతిబింబించి ప్రకాశవంతంగా (Brightest Diamond) మారుతుంది.
...