New Delhi, June 08: భూమికి అతి సమీపంలో ఉండే శుక్రగ్రహం (Venus) ఇప్పుడు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా ఒక వజ్రంలా మెరుస్తూ కనిపిస్తున్నది. సాయంత్రం వేళ సూర్యాస్తమయం తర్వాత దీనిని భూమి మీద నుంచి నేరుగా గమనించవచ్చు. సాధారణంగా శుక్రగ్రహం సూర్యుని మీదుగా లేదా కిందగా వెళ్లినప్పుడు సూర్యకాంతి దాని వాతావరణాన్ని ప్రతిబింబించి ప్రకాశవంతంగా (Brightest Diamond) మారుతుంది. ఇప్పుడు శుక్రగ్రహం ఇదే స్థితిలో ఉన్నందున ఎక్కువ సూర్యరశ్మిని పొందుతూ, ప్రకాశవంతంగా మారిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
పైగా సూర్యుని చుట్టూ దాని కక్ష్యలో తిరుగుతున్న శుక్రగ్రహం ఇప్పుడు సరిగ్గా భూమికి (Earth), సూర్యుడికి దాదాపుగా మధ్యకు వచ్చింది. దీంతో శుక్రగ్రహాన్ని నేరుగా భూమి నుంచి వీక్షించేందుకు ఇది సరైన సమయమని, పశ్చిమ దిశగా రాత్రి 7.30 నుంచి 9.45 వరకు ఆకాశంలో మెరిసే శుక్రుడిని చూడవచ్చని తెలిపారు.