Newdelhi, June 6: జీవనశైలిలో (Lifestyle) మార్పులు, ఆహారపుటలవాట్లు (Food Habits), ఇతర ఆరోగ్య సమస్యలు (Health problems) తదితర కారణాలతో ఇటీవలి కాలంలో చాలామంది గుండెపోటు (Heart Attack) సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే సోమవారం రోజునే తీవ్రమైన గుండెపోటు కేసులు ఎక్కువగా సంభవించే అవకాశమున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్టెమీ అనేది ఓ రకమైన గుండెపోటు. దీనిపై ఐర్లాండ్ లోని బెల్ ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ పరిశోధన అధ్యయనం చేపట్టాయి. 2013 నుండి 2018 వరకు జరిపిన అధ్యయనంలో 10,528 మంది పేషెంట్ల సమాచారాన్ని సేకరించారు. ప్రత్యేకమైన ఈ స్టెమీ గుండెపోటు వారంలో మొదటి రోజు అంటే సోమవారం ఎక్కువగా కనిపిస్తోందని ఈ అధ్యయనం తెలిపింది. అయితే సోమవారమే ఎక్కువగా ఈ గుండెపోట్లు ఎందుకు సంభవిస్తున్నాయో వివరించలేకపోయారు. కాగా, ఆదివారం కూడా స్టెమీ మరణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.

AP CM YS Jagan Mohan Reddy Polavaram Visit: పోలవరం పర్యటనకు బయల్దేరిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అధికారులకు కీలక సూచనలు చేసే అవకాశం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)