Vijayawada, June 6: ఏపీ ముఖ్యమంత్రి (AP Chief Minister) వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పోలవరం పర్యటనకు (Polavaram Tour) బయల్దేరారు. ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో అమరావతి నుంచి పోలవరం వద్దకు ఆయన చేరుకుంటారు. ఇప్పటికే అధికారులు పోలవరం ప్రాజెక్టు వద్ద హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్శన సందర్భంగా పోలవరం ప్రాజెక్టు లోయర్, అప్పడర్ కాఫర్ డ్యామ్‌లను జగన్ పరిశీలించనున్నారు. అలాగే స్పిల్‌వే, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ ప్రాంతాలను జగన్ సందర్శించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Hon’ble CM will be Visiting Polavaram Project Site & Attending Review Me... https://t.co/A802DrJdAl… via @YouTube#YSRPolavaram
— YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) June 6, 2023
అధికారులకు దిశానిర్దేశం
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ప్రాజెక్ట్ వద్ద జలవనరులశాఖ అధికారులు, ఇంజినీర్లతో జగన్ సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి గురించి తెలుసుకోనున్నారు. వేగంగా పనులు చేపట్టేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే జగన్ పర్యటన క్రమంలో శనివారం పోలవరంను జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు.
పనులపై ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సూచన
ఇటీవల ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలవరం పనులను త్వరగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రూ.17 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని ఏపీ అధికారులు కోరారు. దీంతో త్వరలో నిధులను విడుదల చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలవరానికి నిధులు విడుదల కానున్న క్రమంలో ముఖ్యమంత్రి జగన్ పోలవరం పర్యటనకు వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది.