Road Accident: కర్ణాటకలో ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు.. ఐదుగురు ఏపీవాసుల దుర్మరణం.. మరో 13 మందికి గాయాలు.. కలబురిగిలో దర్గా ఉర్సుకు వెళ్లి వస్తుండగా ఘటన

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదుపు తప్పిన జీపు రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది.

Road Accident: కర్ణాటకలో ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు.. ఐదుగురు ఏపీవాసుల దుర్మరణం.. మరో 13 మందికి గాయాలు.. కలబురిగిలో దర్గా ఉర్సుకు వెళ్లి వస్తుండగా ఘటన
Accident (Credits: Wikimedia )

Bengaluru, June 6: కర్ణాటకలో (Karnataka) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీలోని (AP) నంద్యాల (Nandyala) జిల్లా వెలుగోడుకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదుపు తప్పిన జీపు (Jeep) రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది. బాధితులు కలబురిగిలోని దర్గా ఉర్సుకు వెళ్లి వస్తుండగా యాదగిరి జిల్లాలో దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద విషయం తెలిసి వెలుగోడులో విషాద ఛాయలు అలముకున్నాయి.

Hyderabad Suicide: తాగిన మత్తులో ఫ్లై ఓవర్ మీది నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య.. హైదరాబాద్ లోని బాలానగర్ ఫ్లైవర్ పైన ఘటన.. వీడియో ఇదిగో..

బాధితులు వీళ్లే

  • మునీర్ (40)
  • నయామత్ (40)
  • రమీజా బేగం (50)
  • ముద్దత్ షీర్ (12)
  • సుమ్మి (13)

Kerala High Court: నగ్నత్వం, అశ్లీలత ఒకటి కాదు.. కొడుకు, కూతురితో తన నగ్నదేహంపై పేయింటింగ్ వేయించుకున్న సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా కేసులో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్య

(The above story first appeared on LatestLY on Jun 06, 2023 09:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).