Credits: Twitter

Newdelhi, June 6: కేరళ సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా (Rehana Fathima)కు కేరళ హైకోర్టులో (Kerala High Court) ఊరట లభించింది. కుమారుడు, కుమార్తెతో తన నగ్నదేహంపై పెయింటింగ్ (Painting) వేయించుకున్న కేసు నుంచి ఆమెకు తాజాగా న్యాయస్థానం విముక్తి కల్పించింది. ఫాతిమా తన దేహాన్ని పిల్లలకు కాన్వాస్‌గా ఉపయోగించిందే తప్ప లైంగిక ఉద్రేకాలను తృప్తి పరుచుకోడానికి తన పిల్లలను ఉపయోగించుకున్నట్టు భావించకూడదని తేల్చి చెప్పింది. నగ్నత్వం (Nudity), అశ్లీలత (Obscenity) ఒకటి కాదని వ్యాఖ్యానించింది.

AP CM Jagan: రేపు సీఎం వైఎస్ జగన్ ఏలూరు జిల్లా పర్యటన, పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన

అసలేం జరిగిందంటే??

కొన్నేళ్ల క్రితం ఫాతిమా (Fathima) నెట్టింట షేర్ చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. అందులో ఫాతిమా తన శరీరం పైభాగంపై ఎటువంటి ఆచ్ఛాదనా లేకుండా మంచంపై పడుకుని ఉండగా ఆమె కుమార్తె, కుమారుడు ఫాతిమా ఒంటిపై పెయింటింగ్ వేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఫాతిమాపై పోక్సో చట్టం, జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. వీటి నుంచి విముక్తి కల్పించాలంటూ ఫాతిమా తొలుత ట్రయల్ కోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆమె హైకోర్టులో అప్పీలు చేసుకుంది. ఈ క్రమంలో హైకోర్టు న్యాయమూర్తి ఫాతిమాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

మహిళలకు తమ శరీరాలపైనే హక్కులేకుండా పోతున్నదని..

కేసుల నుంచి ఆమెకు విముక్తి కల్పించిన న్యాయమూర్తి నగ్నత్వం, అశ్లీలత ఒకటి కాదని వ్యాఖ్యానించారు. మహిళలకు తమ శరీరాలపైనే హక్కులేకుండా పోతోందని, ఈ విషయంలో వారికి ఎలాంటి నిర్ణయమైనా స్వతంత్రంగా తీసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఇది వారికి రాజ్యంగంలోని 21వ అధీకరణ ద్వారా సంక్రమించిన హక్కు అని తెలిపారు.

Awadhesh Rai Murder Case: మాజీ ఎమ్మెల్యే సోదరుడు హత్య కేసు, ఎమ్మెల్యే ముఖ్తార్‌ అన్సారీకి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు