RSS chief Mohan Bhagwat (Photo-ANI)

చండీఘడ్, అక్టోబర్ 13: సనాతన ధర్మం భారతదేశానికి "పర్యాయపదం" అని, దేశ సంస్కృతి దానిపై ఆధారపడి ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ గురువారం అన్నారు. గత నెలలో సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను స్పష్టంగా ప్రస్తావిస్తూ, దానిని నాశనం చేయాలని చెప్పడం తనకు తాను హాని చేసుకోవడం లాంటిదని అన్నారు.

సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని స్టాలిన్‌ పేర్కొన్నారు. దీనికి ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ స్పందిస్తూ.. మేము ఈ సనాతన్ ద్వారా జీవించాలి," అని RSS చీఫ్ అన్నారు, "యే సనాతన్ భారత్ కే సాథ్ ఏక్రూప్ హై (సనాతన్ భారతదేశానికి పర్యాయపదం)" అని అన్నారు.

సనాతన ధర్మం వ్యాఖ్యల దుమారం, దువ్వుకోవడానికి ఒక దువ్వెన ఇవ్వు చాలంటూ స్వామీజీకి స్టాలిన్ కౌంటర్, రివార్డు పెంచుతానని ఆచార్య మరో ప్రకటన

హర్యానాలోని రోహ్‌తక్‌లోని బాబా మస్త్‌నాథ్ మఠంలో జరిగిన కార్యక్రమంలో భగవత్ ప్రసంగించారు.సనాతన్ ధర్మం హే హిందూ రాష్ట్ర హై, యే అప్నే రాష్ట్ర కే సాథ్ ఏక్రూప్ హై (సనాతన ధర్మం హిందూ రాష్ట్రం, ఇది దేశానికి పర్యాయపదం)", అని ఆయన అన్నారు.సనాతనమంటేనే ఎప్పటికీ నిలిచి ఉండేదని, మన ధర్మం కూడా అంతేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి వీకే సింగ్, యోగ గురు రామ్‌దేవ్, పలువురు సాధు ప్రముఖులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా పరిష్కారం కోసం అంతా భారత్‌కేసే చూస్తున్నారని ఆదిత్యనాథ్ అన్నారు. ఒకప్పుడు అసాధ్యమనుకున్న అయోధ్య రామాలయ నిర్మాణం ఇప్పుడు కళ్లముందు కన్పిస్తున్న వాస్తమని చెప్పారు. అంతకుముందు ఉదయం జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, మహంత్ చంద్‌నాథ్ యోగి విగ్రహాన్ని మఠంలో ఆవిష్కరించారు.