ఉత్తర్‌ప్రదేశ్‌లో 32 ఏళ్ల క్రితం మాజీ ఎమ్మెల్యే అజయ్‌ రాయ్‌ సోదరుడు అవదేశ్‌ రాయ్‌ను అతడి ఇంటి ముందే కాల్చి చంపాడు. ఈ కేసులో గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీని వారణాసి కోర్టు దోషిగా తేల్చింది. అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాకుండా రూ.1 లక్ష జరిమానా విధించింది. 1991, ఆగస్టు 3న అన్సారీ అవదేశ్‌ రాయ్‌ను ఇంటి ముందే కాల్చి చంపాడు.

ఈ కేసులో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్సారీతో పాటు భీమ్‌ ససింగ్‌, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ కలీమ్‌, మరో ఇద్దర్ని నిందితులుగా చేర్చారు. దీనిపై మే 19న తుది విచారణ చేపట్టిన వారణాసి ఎంపీ ఎమ్మెల్యే కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. 61 క్రిమినల్‌ కేసుల్లో అన్సారీ నిందితుడు. తాజా శిక్ష అతడికి ఐదోది. మరో 20 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. భాజపా ఎమ్మెల్యే కృష్ణేందురాయ్‌ హత్య కేసులో కూడా అన్సారీ నిందితుడు

ANI Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)