గాజాపై ఇజ్రాయిల్ దాడిని నిరసిస్తూ డెన్మార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్ (Greta Thunberg) ను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె అరెస్టయ్యింది. స్టూడెంట్స్ అగైనెస్ట్ ది ఆక్యుపేషన్ అనే విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలను దిగ్బంధించారు.
...