Greta Thunberg (File photo/Reuters)

Denmark, SEP 06: గాజాపై ఇజ్రాయిల్ దాడిని నిరసిస్తూ డెన్మార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌ (Greta Thunberg) ను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె అరెస్టయ్యింది (Greta Thunburg Arrested). స్టూడెంట్స్ అగైనెస్ట్ ది ఆక్యుపేషన్ అనే విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలను దిగ్బంధించారు. ఇజ్రాయెల్ యూనివర్సిటీలను బహిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Here's Tweet

 

పాలస్తీనాపై దాడులు కొనసాగుతున్న సమయంలో కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయం ఇజ్రాయిల్ విశ్వవిద్యాలయాలతో సహకరించడం నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, గ్రెటా అరెస్ట్‌పై పోలీసులు స్పందించలేదు.

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై మరోసారి మిసైళ్లతో విరుచుకుపడిన రష్యా, 51 మంది మృతి, మరో 200 మందికి గాయాలు, సైనిక విద్యా కేంద్రంపై క్షిపణి దాడి 

యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగన్‌లో జరిగిన కార్యక్రమంలో కేవలం ఆరుగురిని మాత్రమే అరెస్టు చేసినట్లు పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. క్యాంపస్ ప్రవేశ ద్వారాన్ని మూసివేశామని, అరెస్టు చేసిన వారి పేర్లను వెల్లడించలేమని అన్నారు. అయితే అదుపులోకి తీసుకున్న వారిలో గ్రెటా కూడా ఉన్నట్లు కార్యక్రమ నిర్వాహకులు ధృవీకరించారు.