మహిళల వస్త్రధారణపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్ల్రీలు ధరించే దుస్తుల వల్లే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. మహిళలు తమ వస్త్రధారణతో మగవారి మనసు చెదిరేలా చేస్తున్నారని.. ఫలితంగా మగవారిలో కోరికలు రేగి ('If You Raise Temptation) అత్యాచార కేసులు పెరుగుతున్నాయంటూ ఇమ్రాన్ ఖాన్ (Prime Minister Imran Khan) ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
...