Pakistan PM Imran Khan. (Photo Credits: Social Media)

Karachi, June 22: మహిళల వస్త్రధారణపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్ల్రీలు ధరించే దుస్తుల వల్లే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. మహిళలు తమ వస్త్రధారణతో మగవారి మనసు చెదిరేలా చేస్తున్నారని.. ఫలితంగా మగవారిలో కోరికలు రేగి ('If You Raise Temptation) అత్యాచార కేసులు పెరుగుతున్నాయంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ (Prime Minister Imran Khan) ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

మహిళలు పొట్టి దుస్తులు ధరిస్తే.. మగవారిపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. స్త్రీలు తమ శరీరం కనిపించేలా దుస్తులు ధరిస్తే మగవారి మనస్సు చలిస్తుంది. పురుషులు రోబోలు అయితే తప్ప.. వారు చలించకుండా ఉండరు. ఎందుకంటే మనం నివసిస్తున్న సమాజం పూర్తిగా భిన్నమైంది. ఇక్కడ ఎలా నడుచుకోవాలనే ఇంగిత జ్ఞానం మనకే ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.

దేశంలో (Pakistan) పెరిగిపోతున్న అఘాయిత్యాలను మహిళల వస్త్రధారణతో ఇమ్రాన్ మరోసారి ముడిపెట్టడం చాలా దారుణం అని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్స్ లీగల్ అడ్వైజర్ రీమా ఒమర్ అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని ఇమ్రాన్ సోషల్ మీడియా వ్యవహారాలు చూసే అధికార ప్రతినిధి డాక్టర్ అర్ స్లాన్ ఖాలిద్ అన్నారు. ఇమ్రాన్‌ అన్నదానిని పూర్తిగా చెప్పకుండా కేవలం ఒక వాక్యాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో.. లైంగిక వాంఛలు ఏ స్థాయికి వెళ్లాయో ప్రధాని చెప్పారన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ లోనూ ఇమ్రాన్ ఇలాంటి వ్యాఖ్యలే చేసి అభాసుపాలయిన సంగతి తెలిసిందే.

ఆ వ్యాపారవేత్త నాపై అత్యాచారం చేసి చంపేయడానికి ప్రయత్నించాడు, కాపాడాలంటూ ప్రధానిని సోషల్ మీడియా ద్వారా అర్థించిన బంగ్లాదేశ్‌ హీరోయిన్‌ పోరి మోని, నిందితుడు నజీర్‌ యు మహ్మూద్‌తో సహా నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇదిలా ఉంటే పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మ‌రోసారి క‌శ్మీర్ స‌మ‌స్య‌పై స్పందించారు. ఒక‌సారి క‌శ్మీర్ స‌మ‌స్య ప‌రిష్కార‌మైతే, అప్పుడు రెండు దేశాలు అణ్వాయుధాల‌ను పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు. హెచ్‌బీవో జ‌ర్న‌లిస్టు జోనాథ‌న్ స్వాన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ స‌మాధానం వెల్ల‌డించారు. పాకిస్థాన్‌లో అత్యంత వేగంగా అణ్వాయుధాల‌ను స‌మీక‌రిస్తున్న‌ట్లు ఇంటెలిజెన్స్ నివేదిక‌లు చెబుతున్నాయ‌ని, ఎందుకు అలా జ‌రుగుతున్న‌ట్లు ఆ జ‌ర్న‌లిస్టు పాక్ ప్ర‌ధానిని ప్ర‌శ్నించారు.

ఆ ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ ఇంటెలిజెన్స్‌కు ఎక్క‌డ నుంచి స‌మాచారం వ‌స్తుందో త‌న‌కు తెలియ‌ద‌ని, పాకిస్థాన్ అణ్వాయుధాలు కేవ‌లం ర‌క్ష‌ణ కోసం మాత్ర‌మే అన్నారు. అణ్వాయుధాలు పెరుగుతున్నాయ‌న సంఖ్య త‌న‌కు తెలియ‌ద‌న్నారు. అణ్వాయుధాల‌కు తాను వ్య‌తిరేక‌మ‌ని, ఇండియాతో మూడు సార్లు యుద్ధం జ‌రిగింద‌ని, అణ్వాయుధ సామ‌ర్థ్యం పెరిగిన త‌ర్వాత త‌మ మ‌ధ్య యుద్ధాలు జ‌ర‌గ‌లేద‌ని, కేవ‌లం స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌లు మాత్ర‌మే ఉన్నాయ‌ని ఇమ్రాన్ అన్నారు.

ఒక‌సారి క‌శ్మీర్‌లో సెటిల్మెంట్ స‌మ‌స్య తీరితే, అప్పుడు రెండు పొరుగు దేశాల్లోని ప్ర‌జ‌లు నాగ‌రికుల్లా జీవిస్తార‌న్నారు. అప్పుడు అణ్వాయుధాలు అవ‌స‌రం ఉండ‌ద‌ని పాక్ ప్ర‌ధాని తెలిపారు. చైనాలో ఉయిగ‌ర్ ముస్లింపై జ‌రుగుతున్న దాడుల‌పై ప్ర‌శ్నించ‌గా.. ఆ అంశం గురించి డ్రాగ‌న్ దేశంతో అంత‌ర్గ‌తంగా చ‌ర్చిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఉయిగ‌ర్ల‌ను వ‌దిలేయండి.. క‌శ్మీర్‌లో ల‌క్ష‌ల మంది చ‌నిపోయార‌ని, దాని గురించి ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. అది ఎందుకు స‌మ‌స్య కాదు అని ఇమ్రాన్ అడిగారు.