వలసదారులపై కఠిన విధానాలు అమలుచేస్తోన్నఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల ఉపాధి అధికారం పత్రాల (Employment Authorization Documents - EAD) ఆటోమేటిక్ పొడిగింపును ఇకపై కొనసాగించబోమని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (DHS) ప్రకటించింది.
...