అమెరికా అధ్యక్షుడిగా సోమవారం డొనాల్డ్ ట్రంప్ (Trump Swearing-In Ceremony) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న పలువురు అతిథులు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీకి (Mukesh and Nita Ambani) కూడా ఆహ్వానం అందడంతో వారు ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో ఉన్నారు.
...