Washington, JAN 19: అమెరికా అధ్యక్షుడిగా సోమవారం డొనాల్డ్ ట్రంప్ (Trump Swearing-In Ceremony) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న పలువురు అతిథులు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీకి (Mukesh and Nita Ambani) కూడా ఆహ్వానం అందడంతో వారు ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్‌తో వారు ఫొటో దిగారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో వైరల్ (Mukesh and Nita Ambani Viral Photo) అవుతోంది. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఏర్పాటు చేసిన రిసెప్షన్ డిన్నర్‌కు కూడా ముకేశ్ అంబానీకి ఆహ్వానం అందింది.
ట్రంప్ సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తుండగా, ఆదివారం “క్యాండిల్ లైట్ డిన్నర్” ఇచ్చారు. ఈ సందర్భంగానే ట్రంప్‌తో ముకేశ్ అంబానీ దంపతులు ఫొటోలు దిగారు.
Donald Trump Meets Mukesh and Nita Ambani Ahead of Inauguration
PHOTO | Washington, DC: US President-elect Donald Trump met Nita Ambani and Mukesh Ambani before his swearing-in ceremony.
(Source: Third Party) pic.twitter.com/uBuwNt4ebx
— Press Trust of India (@PTI_News) January 19, 2025
ఈ డిన్నర్ పార్టీకి ముకేశ్ అంబానీ బ్లాక్ సూట్‌లో రాగా, నీతా అంబానీ ఓవర్ కోట్, ఎమరల్డ్స్‌తో కూడిన నల్లని చీరకు వేసుకున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కల్పేశ్ మెహతా ఈ సందర్భంగా ముకేశ్ దంపతులతో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.