Hindenburg Research Shuts Down says Nate Anderson(FB)

అదానీ గ్రూప్‌పై సంచలన నివేదికతో అందరి దృష్టిని ఆకర్షించింది హిండెన్ బర్గ్. అయితే అనూహ్యంగా తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

హిండెన్ బ‌ర్గ్ మూసివేత వెనుక ఎలాంటి భయాలు, వ్యక్తిగత విషయాలు, అనారోగ్య సమస్యలు లేవని హిండెన్ బర్గ్ రీసెర్చ్‌ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ తెలిపారు.

తన జీవితంలో దీనిని ఒక అధ్యాయంగా చూస్తున్నానని పేర్కొన్నారు. అయితే ఎందుకు మూసివేస్తున్నామ‌నే విష‌యంపై కూడా ప్ర‌త్యేక కార‌ణాలు వెల్ల‌డించ‌లేదు. అలాగే హిండెన్ బ‌ర్గ్ ను ఎప్ప‌టివ‌ర‌కు పూర్తి చేస్తామ‌నే విష‌యంపై ప్ర‌త్యేక తేదీని ప్ర‌క‌టించ‌లేదు. అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో...స్పాడెక్స్ డాకింగ్ ప్రక్రియ పూర్తి, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంలో నిలిచిన భారత్, ప్రధాని అభినందనలు

కానీ, ప్ర‌స్తుతం సంస్థ నిర్వ‌హిస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేసిన త‌ర్వాత ముగించాల‌నేది త‌మ ప్ర‌ణాళిక‌గా ఉంద‌ని నేట్ ఆండ‌ర్స‌న్ పేర్కొన్నారు. సంస్థ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను కూడా పేర్కొన్నారు.

 Hindenburg Shuts Down

అదానీ గ్రూప్ షేరు ధరలను తారుమారు చేసిందని ఆరోపిస్తూ హిండెన్బర్గ్ రీసెర్చ్ 2023 జనవరిలో తన నివేదికలో ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. దీంతో ఆ కంపెనీ షేరు విలువ గణనీయంగా పడిపోయి దాదాపు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తుడిచిపెట్టుకుపోయింది.