ISRO SpaDeX Mission: అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో...స్పాడెక్స్ డాకింగ్ ప్రక్రియ పూర్తి, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంలో నిలిచిన భారత్, ప్రధాని అభినందనలు
అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించింది ఇస్రో. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి స్పేడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించి ఈ ఘనత సాధించిన నాలుగోవ దేశంగా నిలిచింది.
Delhi, Jan 16: అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించింది ఇస్రో. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి స్పేడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించి ఈ ఘనత సాధించిన నాలుగోవ దేశంగా నిలిచింది.
హోల్డ్ పాయింట్ ను 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చే ప్రక్రియ పూర్తికాగా అంతరిక్ష నౌకను విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి డిసెంబర్ 30న PSLV-C60 రాకెట్ సహాయంతో ఇస్రో ఈ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది.ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రి అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న షా, చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు
చిన్న అంతరిక్ష నౌకను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ ప్రక్రియను ప్రదర్శించడం డాకింగ్ ఉద్దేశం. అయితే, జనవరి 7, 9 తేదీల్లో డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పాడెక్స్) వాయిదాపడింది. తొలి లాంచ్‌ప్యాడ్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్ రెండు ఉపగ్రహాలతో పాటు 24 పేలోడ్‌లను మోసుకెళ్లింది. దాదాపు 15 నిమిషల తర్వాత ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలను వృత్తాకార క్షక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ రెండు రాకెట్లు ఒక్కోటి 220 కిలోల బరువు ఉంటుంది.
ISRO Tweet On Docking Success
SpaDeX Docking Update:
🌟Docking Success
Spacecraft docking successfully completed! A historic moment.
Let’s walk through the SpaDeX docking process:
Manoeuvre from 15m to 3m hold point completed. Docking initiated with precision, leading to successful spacecraft capture.…
— ISRO (@isro) January 16, 2025
డాకింగ్ పూర్తి కావడంతో భారత్ అంతరిక్షంలో స్పేస్ స్టేషన్‌ను నిర్మించబోతున్నది. అలాగే, చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అమెరికా, రష్యా, చైనాకు మాత్రండగా తాజాగా డాకింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నాలుగో దేశంగా నిలిచింది భారత్.
Modi Congratulates scientists
Congratulations to our scientists at @isro and the entire space fraternity for the successful demonstration of space docking of satellites. It is a significant stepping stone for India’s ambitious space missions in the years to come.
— Narendra Modi (@narendramodi) January 16, 2025
(The above story first appeared on LatestLY on Jan 16, 2025 11:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

