Vij, Jan 16: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
ఎల్లుండి రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరనికి చేరుకోనున్నారు. ఆ రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఇవ్వనున్నారు. ఏపీ పర్యటన సందర్భంగా విజయవాడ లోని హోటల్లో బస చేయనున్నారు.
19న ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్‌ను ప్రారంభిస్తారు అమిత్ షా. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రారంభోత్సవం తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు హోంమంత్రి అమిత్ షా. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం..తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై చర్చ, పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం
ఇక ఇటీవలె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. రూ.2 లక్షల కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.