Kerala Shocker: ఈమె తల్లేనా అసలు.. ఏడుస్తుందని 27 రోజుల పసికందును గోడకేసి బాది చంపేసింది, కేరళలో దారుణ ఘటన, నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

27 రోజుల పసికందును ఓ కర్కశ తల్లి దారుణంగా (Kerala Mother kills 27-day-old baby) చంపేసింది. పసిబిడ్డ అనారోగ్యంతో బాధపడటం అలాగే ఎప్పుడూ ఏడుస్తుండటంతో ఆ తల్లి దారుణంగా హతమార్చింది.

Premature Baby- Representational image Only | (Photo Credits; Pixabay)

Pathanamthitta, Dec 14: కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 27 రోజుల పసికందును ఓ కర్కశ తల్లి దారుణంగా (Kerala Mother kills 27-day-old baby) చంపేసింది. పసిబిడ్డ అనారోగ్యంతో బాధపడటం అలాగే ఎప్పుడూ ఏడుస్తుండటంతో ఆ తల్లి దారుణంగా హతమార్చింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలో నెలలు పూర్తిగా నిండకుండానే జన్మించిన ఓ శిశువు ఆరోగ్య పరంగా చాలా బలహీనంగా ఉండేది. దీంతో కొన్నిరోజులుగా ఆ శిశువు అనారోగ్యంతో బాధపడుతోంది.

ఇక చేసేదేమి లేక ఆ బిడ్డ తల్లి శిశువుని తీసుకొని ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించి, వారి సూచించిన మేరకు పలు పరీక్షలు, మందులు కూడా తీసుకుని ఇంటికి రావడం ఇదే పనిగా మారింది. అయినా ఆ శిశువుకి ఏ మాత్రం అనారోగ్యం తగ్గకపోవడం, మరో పక్క ఏడూస్తూనే ఉండడంతో బిడ్డ మరింతగా ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆ శిశువు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

కాగా ఆ శిశువు తల్లి ఒక ఆశ్రమంలో వంట మనిషిగా పనిచేస్తోంది. ఆ ఆశ్రమం నడుపుతున్న ఫాదర్ జోజి థామస్‌కు శిశువు హఠాత్తుగా మరణించడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో భాగంగా పోస్ట్‌మార్టం తర్వాత, ఒక పోలీసు అధికారి సర్జన్‌తో మాట్లాడగా, పసికందు తల వెనుక భాగంలో గాయాలు ( bangs his head against wall for crying) ఉన్నాయని తెలుసుకున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు శిశువు తల్లిని విచారించగా అసలు నిజం బయటకు వచ్చింది.

భర్త శృంగారానికి పిలిచినందుకు.. నన్నే పిలుస్తావా అంటూ పురుషాంగాన్ని కత్తితో కోసేసిన భార్య, మధ్యప్రదేశ్‌లోని టికామ్‌ఘడ్ పట్టణంలో దారుణం, నిందితురాలు అరెస్ట్

పసికందు తండ్రికి ఇదివరకే పెళ్లయిందని, ఈ విషయం తెలిసినప్పటికీ తాను అతనితో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇటీవల ఆ శిశువుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తాను కొంత మానసిక అసౌకర్యానికి గురైనట్లు, చివరికి కోపంతో తానే కొట్టడంతో శిశువు చనిపోయిందని అంగీకరించింది. బిడ్డను తల్లే హత్య చేసిందని తేలడంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కొట్టాయంలోని ఓ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న మహిళ తన ప్రేమికుడిని ఫోన్‌లో కలిశారని, అనారోగ్యంతో ఉన్న పసికందు తన తదుపరి చదువుకు హాని కలిగిస్తుందని అందుకే ఆమె తన బిడ్డను చంపాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.