Kanuma Festival 2022: కనుమరోజు మేకకాళ్ల పులుసు తింటే ఆ కిక్కే వేరప్పా, అయితే ఎలా తయారు చేయాలో చకచకా తెలుసుకుందాం..

కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ. మాంసాహారులు కానివారు మినుప గారెలు తింటారు. కనుమను ‘ముక్కల పండుగ’ అని అంటారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. అయితే కనుమ పండుగ రోజు స్పెషల్ మేకకాళ్ల పులుసు, చిల్లిగారెలు చాలా ఇష్టంగా తింటారు.

sankranthi
కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ. మాంసాహారులు కానివారు మినుప గారెలు తింటారు. కనుమను ‘ముక్కల పండుగ’ అని అంటారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. అయితే కనుమ పండుగ రోజు స్పెషల్ మేకకాళ్ల పులుసు, చిల్లిగారెలు చాలా ఇష్టంగా తింటారు. మేకకాళ్ల పులుసు, గారెల కాంబినేషన్ అదిరిపోతుందని భోజన ప్రియులు అంటారు. మరి ఆ స్పెషల్స్ ఎలా తయారు చేయాలో మీకోసం..
How to Prepare Meka Kalla Pulusu:

కావలసినవి: మేక కాళ్లు - ఐదు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, పుదీనా తరుగు - పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, కారం - రెండు టీస్పూన్లు, ధనియాల పొడి - రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా - అర టీస్పూన్‌, చింతపండు పులుసు - అరకప్పు, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత.

తయారీ: మేక కాళ్లు కాల్చి పసుపు రాసి, నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత మూడు అంగుళాల సైజులో ముక్కలుగా కట్‌ చేయాలి. కుక్కర్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి వేగించాలి. తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత కాళ్లు, గరంమసాలా వేసి కలపాలి. ఇప్పుడు ఐదు గ్లాసుల నీళ్లు, చింతపండు పులుసు పోసి, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి 8 విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. పాయ కోసం పోట్లీ మసాలా అని దొరుకుతుంది. ఆ పొడి ఒక స్పూన్‌, కొన్ని మసాల దినుసులు ఒకచిన్న వస్త్రంలో వేసి కట్టాలి. దీన్ని కాళ్లతోపాటు ఉడికిస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. పాయలోకి గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలు, నాన్‌ రుచిగా ఉంటాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now