ఆదివారం, ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అక్షయ్ తల్లిదండ్రులను, అతని తమ్ముడిని రెండవ సారి ప్రశ్నించింది. అదనపు సాక్ష్యాలను సేకరించడానికి అతని ఇంటికి వెళ్ళింది.మరోవైపు ఫోరెన్సిక్ ల్యాబ్ బృందం రెండోసారి పాఠశాలను సందర్శించి మరిన్ని ఆధారాలు సేకరించింది.
ఆగస్టు 13న బద్లాపూర్‌లో ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై లైంగిక వేధింపులకు గురికాగా, వారి తల్లిదండ్రులు పాఠశాల అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.తదనంతరం, బాలికల తల్లిదండ్రులు ఆగస్టు 16 న మధ్యాహ్నం సమయంలో కేసు నమోదు చేయడానికి బద్లాపూర్ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు, అయితే 12 గంటల పాటు వేచి ఉండేలా చేశారు. అనంతరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారిస్తామని సీఎం ఏక్నాథ్ షిండే హామీ ఇచ్చారు. షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు, పశ్చిమగోదావరి జిల్లాలో విషాదకర ఘటన
Here's Video
#WATCH | Maharashtra | Accused in Badlapur alleged sexual assault incident sent to judicial custody for 14 days by Kalyan Court pic.twitter.com/LNlICINmso
— ANI (@ANI) August 26, 2024
(SocialLY brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user's social media account and LatestLY Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of LatestLY, also LatestLY does not assume any responsibility or liability for the same.)