Happy Father's Day Greetings: హ్యాపీ ఫాదర్స్ డే మెసేజెస్ వీడియో, నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, పితృ దినోత్సవ శుభాకాంక్షలు ఈ మెసేజెస్‌తో వారికి చెప్పేయండి

Fathers day 2022 Telugu

Father's Day wishes: అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే.. నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి. బయటకు గంభీరంగా కనిపించినా.. మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు. పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని సైతం త్యజించే త్యాగమూర్తి నాన్న. నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, భరోసా. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. ఈ వీడియో ద్వారా నాన్నకు శుభాకాంక్షలు చెప్పేద్దాం.