Hyderabad Shocker: పెళ్లి అయిన మరుసటి రోజే వధువుకు ప్రసవం.. షాక్ కు గురైన పెళ్లికొడుకు.. హైదరాబాద్ లో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో తర్వాత మలుపు ఏంటంటే??
పెళ్లి అయిన మరుసటి రోజే వధువు ప్రసవించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Hyderabad, June 30: హైదరాబాద్ లో (Hyderabad) షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి అయిన మరుసటి రోజే వధువు (Bride) ప్రసవించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు (Shock) గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ కు చెందని మహిళకు గ్రేటర్ నోయిడాలోని (Greater Noida) ఒక వ్యక్తితో ఈ నెల 26న పెళ్లి జరిగింది. పెళ్లి అయిన రాత్రి ఆమెకు కడుపు నొప్పి వచ్చింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. వధువు గర్భవతి అని వైద్యులు చెప్పారు. ఆ మరుపటి రోజే వధువు ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వధువు ప్రసవించడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఆమెను కోడలిగా స్వీకరించేందుకు వరుడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో నోయిడా నుంచి ఆమెను తల్లిదండ్రులు సికింద్రాబాద్ కు తీసుకొచ్చారు.
అలా బురిడీ కొట్టించారు
వాస్తవానికి పెళ్లికి ముందే పెళ్లి కొడుకు (Bridegroom) కుటుంబ సభ్యులకు పెళ్లికూతురు పొట్ట కొంచెం పెద్దగా ఉండటంతో అనుమానం వచ్చింది. అదే విషయంపై వధువు కుటుంబ సభ్యులను వారు ప్రశ్నించారు. అయితే, పొట్టలో రాళ్లు తీయించుకోవడానికి ఆపరేషన్ చేయించుకుందని... అందుకే కడుపు కొంచెం వాపుగా కనిపిస్తోందని చెప్పారు. దీంతో వరుడి కుటుంబ సభ్యలు పెళ్లికి అభ్యంతర పెట్టలేదు.