Dhanush and Aishwayaa Divorce: రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, హీరో ధనుష్ విడాకులు, సోషల్ మీడియా ద్వారా ప్రకటన, షాక్ లో అభిమానులు
సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ స్టార్ హీరో ధనుష్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తాము విడిపోతున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా ధనుష్ వెల్లడించాడు. దాదాపు 18ఏళ్లు కలిసున్న ఐశ్వర్య-ధనుష్ జంట విడిపోవడం అందరినీ షాక్ కి గురిచేస్తోంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ స్టార్ హీరో ధనుష్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తాము విడిపోతున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా ధనుష్ వెల్లడించాడు. దాదాపు 18ఏళ్లు కలిసున్న ఐశ్వర్య-ధనుష్ జంట విడిపోవడం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. రజనీకాంత్ పెద్ద కూతురే ఐశ్వర్య. ధనుష్-ఐశ్వర్య 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన భార్యతో విడిపోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ధనుష్ ప్రకటించాడు.
🙏🙏🙏🙏🙏 pic.twitter.com/hAPu2aPp4n
— Dhanush (@dhanushkraja) January 17, 2022
‘మేం 18 సంవత్సరాల పాటు కలిసి ఉన్నాము. స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా.. ఇలా ఎన్నో రకాలుగా కలిసి జీవించాం. కానీ ఈరోజు విడిపోయే చోట నిలబడ్డాం. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. దీన్ని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రైవసీని మాకు అందించండి. ఓం నమశివాయ! ప్రేమతో మీ ధనుష్’ అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు ధనుష్. కాగా, ఇటీవలే ప్రముఖ సినీ జంట నాగచైతన్య, సమంత విడిపోయారు. విడిపోతున్నట్టు వీరిద్దరూ చేసిన ప్రకటన సినీ పరిశ్రమలో సంచలనమైంది. లవ్లీ కపుల్ గా గుర్తింపు పొందిన వీరి జోడీ విడిపోవడం అభిమానులను తీవ్రంగా బాధించింది.
(The above story first appeared on LatestLY on Jan 18, 2022 09:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

