అల్లు అర్జున్ (AlluArjun) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప’ (PUSHPA). సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కు సైతం రెడీ అయ్యింది. ఈ సినిమా కోసం స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తొలిసారి స్పెషల్ సాంగ్ చేశారు. ‘ఊ అంటావా మామ ఊ ఊ అంటావా’ అంటూ ఆమె బన్నీతో కలిసి స్టెప్పులేసి ప్రేక్షకుల్ని అలరించారు. దీంతో ఈ పాటకు ప్రేక్షకాదరణ లభిస్తోంది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఈ పాటకు ఫిదా అయిపోతున్నారు.
ఈ నేపధ్యంలో ఈ పాటకు తన పడ్డ కష్టం,రిహార్సల్ చూపిస్తూ సమంత ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడీ ఈ పాటకు రీల్స్ చేయడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తుండగా.. మరోవైపు ఇదే పాటపై మీమర్స్ సరదా పేరడీలు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్ల మది దోచిన రీల్స్, పేరడీలకు మించి సమంత చేసిన రిహార్సల్ పై ఓ లుక్కేద్దాం..
‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సాగే ఈ మాస్ సాంగ్‌ని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్‌తో ఆకట్టు కునేలా పాడింది.