Anasuya In Vijayawada: విజయవాడలో అనసూయకు ఘోర అవమానం, మెడలో తాళిబొట్టు కనబడగానే ట్రోల్ చేసిన నెటిజన్లు, పాపం అనసూయ అంటున్న ఫ్యాన్స్...

అనసూయను ట్రోలర్స్ ఇప్పట్లో వదిలేలా లేరు. ఎక్కడ కనిపించిన ట్విట్టర్ లోకి వచ్చి ఆడేసుకుంటున్నారు. ఆంటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అనసూయ ఏ పోస్ట్ చేసినా నెటిజెన్స్ ట్రోల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా, కేసులు పెట్టినా, హెచ్చరించినా నెటిజెన్స్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.

Anasuya In Vijayawada: విజయవాడలో అనసూయకు ఘోర అవమానం, మెడలో తాళిబొట్టు కనబడగానే ట్రోల్ చేసిన నెటిజన్లు, పాపం అనసూయ అంటున్న ఫ్యాన్స్...
Anasuya Bharadwaj (Photo Credits: Twitter)

అనసూయను ట్రోలర్స్ ఇప్పట్లో వదిలేలా లేరు. ఎక్కడ కనిపించిన ట్విట్టర్ లోకి వచ్చి ఆడేసుకుంటున్నారు. ఆంటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  అనసూయ ఏ పోస్ట్ చేసినా నెటిజెన్స్ ట్రోల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా, కేసులు పెట్టినా, హెచ్చరించినా నెటిజెన్స్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇటీవల అనసూయ ఫ్యామిలీతో కలిసి విజయవాడ వెళ్లారు. ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. గోశాల సందర్శించారు. తన ట్రిప్ కి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ అనసూయ పంచుకోలేదు. జస్ట్ విజయవాడ అని కామెంట్ పెట్టారు.

అయితే సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలపై  నెటిజెన్స్ ట్రోల్స్ తో విరుచుకుపడుతున్నారు. హ్యాపీ జర్నీ ఆంటీ, అంకుల్-అని కామెంట్స్ పెడుతున్నారు. ఓ నెటిజెన్ అయితే 'నీ మెడలో ఎన్నాళ్లకు తాళిబొట్టు కనిపించింది' అని కామెంట్ పెట్టేశాడు. దీంతో ట్రోలర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో అనసూయకు అర్థం కావడం లేదు.

జితేష్.. మీ గౌరవప్రదమైన ప్రవర్తనకు నా అభినందనలు.. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు బాసటగా నిలిచిన మంత్రి కేటీఆర్

నిజానికి లైగర్ ప్లాప్ తనకు చాలా సంతోషాన్ని కలిగించిందంటూ అనసూయ చేసిన ట్వీట్ వల్లనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. డిజాస్టర్ టాక్ తో కోపంలో ఉన్న దేవరకొండ ఫ్యాన్స్ పుండుపై అనసూయ కారం చల్లింది. దీంతో వాళ్ళు రెచ్చిపోతున్నారు.  చివరకు అనసూయను నటుడు బ్రహ్మాజీ సైతం ఆట పట్టించాడు. తనను అంకుల్ అంటే కేసు పెడతా.. అని బ్రహ్మాజీ ట్వీట్ చేయడం అందరిలోనూ నవ్వులు పూయించింది.

(The above story first appeared on LatestLY on Sep 03, 2022 07:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).