Jabardasth Dorababu Business: అమీర్ పేట్ లో కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన జబర్దస్త్ దొరబాబు, హైపర్ ఆది మేలు మరువలేనంటూ కన్నీళ్లు పెట్టుకొని, వామ్మో ఏంట్రా బాబోయ్..

దొరబాబు తన టీమ్ లీడర్ హైపర్ ఆది ఆశీస్సులతో ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మైత్రీవనం సమీపంలో 'శ్రీనిక' అనే టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించాడు.

Jabardasth Dorababu Business: అమీర్ పేట్ లో కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన జబర్దస్త్ దొరబాబు, హైపర్ ఆది మేలు మరువలేనంటూ కన్నీళ్లు పెట్టుకొని, వామ్మో ఏంట్రా బాబోయ్..
దొరబాబు, హైపర్ ఆది (Image Credit: Facebook)

జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్ అంటే కచ్చితంగా అందులో దొరబాబు, పరదేశి చేసే కామెడీ అంతా ఇంతా కాదు ముగ్గురు కలిసారంటే చాలు పంచుల వర్షం కురవాల్సిందే. నిజానికి దొరబాబు పెద్దగా పంచులు పేల్చలేక పోయినా అతడు జీవితంలో చేసిన ఒక పెద్ద మిస్టేక్ అతడికి తెలిసో తెలియకో బాగా కలిసి వచ్చింది. నిజానికి దొరబాబు బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించిన దొరబాబు నటుడు అవ్వాలనే కోరికతో హైదరాబాద్ కు వచ్చాడు. అంతేకాదు టాలీవుడ్ లో కొన్ని బీ గ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఆ తర్వాత అనుకోకుండా జబర్దస్త్ షోలో హైపర్ ఆది టీంలో చేరిన తరువాత దొరబాబు ఫేమస్ అయ్యాడు. అమూల్య అనే యాంకర్ ను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఓ సారి దొరబాబు, పరదేశీలు వ్యభిచార గృహంలో పట్టుబడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన జరిగి రెండేళ్లు గడిచిపోయినా హైపర్ ఆది మాత్రం ఇప్పటికే వీలు చిక్కినప్పుడల్లా దొరబాబు, పరదేశీలపై వ్యభిచార గృహంలో పట్టుబడిన సంఘటననను గుర్తు చేస్తూ పంచ్‌లు వేస్తున్నాడు. ఇదంతా ఒక ఎత్తయితే హైపర్ ఆది తన టీమ్ లోని దొరబాబు, పరదేశీలను చాలా ప్రోత్సాహం అందించాడు.

అయితే తాజాగా దొరబాబు తన టీమ్ లీడర్ హైపర్ ఆది ఆశీస్సులతో ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మైత్రీవనం సమీపంలో 'శ్రీనిక' అనే టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించాడు. ఈ విషయాన్ని జబర్దస్త్ శాంతి స్వరూప్ తన వీడియో బ్లాగ్ లో ఈ విషయమై వీడియో ద్వారా వివరించింది.

టిఫిన్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి హైపర్ ఆది మరియు శాంతి స్వరూప్‌తో పాటు, ఇతర జబర్దస్త్ కమెడియన్స్ అప్పారావు, రైజింగ్ రాజు, రాకెట్ రాఘవ, పరదేశి, ప్రసాద్ మరియు నాగి, రాము ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాదు వారంతా టిఫిన్ సెంటర్ లో ఆహారాన్ని రుచి చూశారు. సరసమైన ధరలకు ఆంధ్రా, తెలంగాణా వంటకాలను అందజేస్తున్నట్లు హైపర్ ఆది తెలిపారు. హైదరాబాద్ మైత్రీవనం దగ్గర్లో ఉన్న ఈ టిఫిన్ సెంటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

(The above story first appeared on LatestLY on Oct 30, 2021 01:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).