Nizamabad Hospital: నిజామాబాద్ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై తప్పుడు ప్రచారం, మద్యానికి బానిసైన వ్యక్తిని.. ఆసుపత్రిలో వీల్ చైర్ అందుబాటులో ఉన్నా కూడా లాక్కెళ్లిన అతని తల్లితండ్రులు
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది, పూర్తిగా అవాస్తవమని సూపరిండెంట్ ప్రతిమ రాజ్ తెలిపారు. మద్యం మత్తులో ఉన్న పేషెంట్ ను ఈడ్చుకెళ్లింది ఆసుపత్రి సిబ్బంది కాదు..ఇద్దరు పేషెంట్ తల్లిదండ్రులు ఈడ్చుకెళ్లారని, ఆసుపత్రిలో వీల్ చైర్,స్ట్రెచర్ల కొరత లేదని తెలిపారు.
తాజాగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ రోగిని నేలపై ఈడ్చుకు వెళుతూ అతని తల్లిదండ్రులు తీసుకు వెళుతున్న దృశ్యం ట్విట్టర్ ద్వారా వైరల్ గా మారింది. ఈ వీడియోను అటు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల తో పాటు. పలువురు బిజెపి నేతలు అలాగే పలు పార్టీల సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ 11 సెకండ్ల వీడియోను పోస్ట్ చేసి వైరల్ చేశాయి. అయితే ఈ వీడియో పూర్వపరాల్లోకి వెళ్తే ఈ సంఘటన గత నెల ఏప్రిల్ 1న జరిగినట్లు తేలింది కాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది, పూర్తిగా అవాస్తవమని సూపరిండెంట్ ప్రతిమ రాజ్ తెలిపారు. ఈ సంఘటన గురించి సెక్యూరిటీ సిబ్బందిని విచారించగా పూర్తి వివరాలు తెలిశాయని ఆమె తెలిపారు. అయితే పేషెంట్ ను ఈడ్చుకెళ్లింది ఆసుపత్రి సిబ్బంది కాదు..ఇద్దరు పేషెంట్స్ బంధువులు ఈడ్చుకెళ్లారని, ఆసుపత్రిలో వీల్ చైర్,స్ట్రెచర్ల కొరత లేదని తెలిపారు.
సూపరిండెంట్ ప్రతిమ రాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఓ క్లారిటీ ఇచ్చారు. సదరు వీడియోలో ఉన్నవ్యక్తిని అతని తల్లిదండ్రులు 31.03.2023 రాత్రి 10.00 గంటలకు అస్వస్థతగా ఉన్నాడని అత్యవసర విభాగానికి తీసుకొనివచ్చారని అప్పటికే అతను మద్య పానం మత్తులో ఉన్నట్లు తెలిపారు. అక్కడ ఉన్న వైద్యులు అతన్ని పరీక్షించి, అతనికి ఇతర సమస్యలు ఉన్నాయని గుర్తించి, సైకియాట్రిస్టుకు చూపించాలని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు.
నిజామాబాద్ ఆసుపత్రిలో 15 రోజుల క్రితం జరిగి వైరల్ అయిన వీడియో గురించి క్లారిటీ ఇచ్చిన ఆసుపత్రి సూపరింటెండెంట్ https://t.co/NpntUWHzpI pic.twitter.com/pC8f2BJKSj
— Telugu Scribe (@TeluguScribe) April 15, 2023
ఆ తర్వాత పేషెంట్ కేర్ సిబ్బంది ఆ వ్యక్తిని వీల్ చైర్లో కూర్చోబెట్టి, రోగులు వేచి ఉండే కాజువాలిటీలో లో బెంచ్ పైన కూర్చోబెట్టి వెళ్లినట్లు తెలిపారు. ఉదయం సుమారు 11.08 నిమిషాలకు ఓపీ చిట్టి తీసుకుని 2వ అంతస్తుకు వెళ్ళవలసి ఉండగా, పేషెంట్ కేర్ సిబ్బంది చక్రాల కుర్చీ తీసుకొచ్చే లోపు లిఫ్ట్ వచ్చింది. దాంతో అతని తల్లిదండ్రులు ఆ వ్యక్తిని లాగుతూ లిప్ట్‌లో పై అంతస్తుకు తీసుకెళ్లారు. పూర్తి అవగాహన లేకుండా, పూర్తి సమాచారం లేకుండా ఇలాంటి వీడియోలు తీసి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోగొట్టవద్దని, దుష్ప్రచారాలు చేయడం చాలా బాధాకరమని ఆమె అన్నారు.
(The above story first appeared on LatestLY on Apr 15, 2023 04:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

