Independence Day 2026: ఆగస్టు 15 వేడుకలకు ముందు ఉగ్ర ముప్పు.. స్వాతంత్ర్య దినోత్సవం లక్ష్యంగా పాక్ ఐఎస్ఐ దాడులకు కుట్ర.. సరిహద్దుల్లో హై అలర్ట్..

ఈ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం (BSF) ఆగస్టు 10 నుండి 17 వరకు 'ఆపరేషన్ అలర్ట్'ను ప్రారంభించింది. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో నిఘాను, పెట్రోలింగ్‌ను గణనీయంగా పెంచారు.

Independence Day 2026: ఆగస్టు 15  వేడుకలకు ముందు ఉగ్ర ముప్పు.. స్వాతంత్ర్య దినోత్సవం లక్ష్యంగా పాక్ ఐఎస్ఐ దాడులకు కుట్ర.. సరిహద్దుల్లో హై అలర్ట్..
Representational Image (Photo Credits: PTI)

Independence Day 2026: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ నిఘా వర్గాలు సంచలన హెచ్చరికలు జారీ చేశాయి. ఆగస్టు 15 వేడుకలకు ముందు దేశంలో ఉగ్రవాద దాడులు జరిగే తీవ్ర అవకాశం ఉందని.. పాకిస్థాన్ గూఢచారి సంస్థ 'ఐఎస్ఐ' మద్దతుతో ఉగ్రవాదులు సరిహద్దుల వద్ద గానీ లేదా దేశంలోని ఇతర ప్రాంతాలలో గానీ దాడులకు తెగబడే కుట్ర పన్నుతున్నారని తెలిపాయి. ఈ నిఘా సమాచారంతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను అత్యున్నత స్థాయికి పెంచింది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వంటి సున్నిత ప్రాంతాలపై భద్రతా బలగాల దృష్టి ఎక్కువగా ఉంటుందని, ఇదే అదనుగా దాడులకు పాల్పడాలని ఐఎస్ఐ భావిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారులు తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) మరియు బలూచిస్థాన్‌లలో నెలకొన్న తీవ్రమైన అంతర్గత సమస్యల నుంచి తమ దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఐఎస్ఐ ఈ చర్యలకు పూనుకుంటోందని అంచనా వేస్తున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం 2026.. ఆగష్టు 15, 2026న భారతదేశానికి ఇది 79వ స్వాతంత్ర్య దినోత్సవమా లేక 80వదా? సరైన సమాధానం తెలుసుకోండి..

జమ్మూ కాశ్మీర్ గుండా గానీ, లేదా బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా గానీ ఉగ్రవాదులను దేశంలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు హెచ్చరించారు. అంతేకాకుండా, భద్రతా బలగాల దృష్టిని పక్కదారి పట్టించడానికి ఢిల్లీ లేదా కశ్మీర్‌లో దాడులు జరగొచ్చనే ముసుగులో.. భద్రత తక్కువగా ఉండే టైర్-2 నగరాలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందనే కోణంలోనూ దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.

ఈ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం (BSF) ఆగస్టు 10 నుండి 17 వరకు 'ఆపరేషన్ అలర్ట్'ను ప్రారంభించింది. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో నిఘాను, పెట్రోలింగ్‌ను గణనీయంగా పెంచారు.

మరోవైపు, అత్యంత సున్నితమైన బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా జరిగే చొరబాట్లు, స్మగ్లింగ్ కార్యకలాపాలను శాశ్వతంగా అరికట్టేందుకు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాల్లో సుమారు 40 'సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో' (SIB) యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాడుల ముప్పు దృష్ట్యా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు మరియు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలలో రెడ్ అలర్ట్ ప్రకటించి తనిఖీలను తీవ్రతరం చేశారు.

(The above story first appeared on LatestLY on Aug 11, 2026 02:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).