Omicron In India: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కలకలం, 11 రాష్ట్రాలకు విస్తరించిన కొత్త వేరియంట్ వైరస్ కేసులు, నేడు నమోదైన కేసులు ఎన్ని ఉన్నాయంటే..?

ఒమిక్రాన్ (Omicron variant) పలు దేశాల్లో కలవరపెడుతోంది. అటు దేశ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) 11 రాష్ట్రాలకు విస్తరించిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Omicron In India: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కలకలం, 11 రాష్ట్రాలకు విస్తరించిన కొత్త వేరియంట్ వైరస్ కేసులు, నేడు నమోదైన కేసులు ఎన్ని ఉన్నాయంటే..?
Image used for representational purpose | (Photo Credits: Pixabay)

New Delhi, Dec 18: కరోనా వైరస్ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా కుదుపేస్తోంది. ఒమిక్రాన్ (Omicron variant) పలు దేశాల్లో కలవరపెడుతోంది. అటు దేశ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) 11 రాష్ట్రాలకు విస్తరించిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32, ఢిల్లీలో 22 కేసులు బయటపడినట్లు తెలిపింది. ఈ తర్వాత రాజస్తాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8 గుజరాత్‌లో 5 కేరళలో 5 కేసులు వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, బెంగాల్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదూనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

కేసులు పెరిగినా ఎలాంటి లాక్‌డౌన్ ఉండదు, తెలంగాణలో మరొకరికి ఒమిక్రాన్, 8కి చేరిన మొత్తం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య, క‌రోనా మూడో ద‌శ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్న స‌ర్కారు

దేశంలో నమోదైన కేసుల్లో 50 శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయి. దీంతో కరోనా వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకునేందుకు అటు మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మహారాష్ట్రలోని నాగపూర్, పుణె, ముంబయి లాంటి మహానగరల్లో ఇప్పటికే ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. డెల్టా వేరియంట్‌ కంటే పది రెట్ల వేగంతో ఒమిక్రాన్‌ వ్యాప్తిచెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌తోపాటు రెండు డోసుల టీకా వేసుకున్నవారిని మాత్రమే మహారాష్ట్ర సరిహద్దు రాష్ట్రాల్లో అనుమతించేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ కూడా చేయాలని కోరుతున్నారు. రాకపోకలు సాగిస్తున్న వారికి పరీక్షలు నిర్వహించి వివరాలు నమోదు చేయడం ద్వారా ముప్పును నియంత్రించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. మరోవైపు వైద్యాధికారులు కూడా ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంటున్నారు. బయటకు వెళ్లేవారు, ప్రయాణాలు చేసేవారు తరచుగా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలంటున్నారు.

ఒమిక్రాన్‌ వైరస్‌ ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో ప్రజలు ముందుస్తు జాగత్రలు పాటించాలి. మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కులు ధరించాలి. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని వారు వెంటనే టీకాలు తీసుకోవాలి. మొదటి టీకాను తీసుకున్నావారు గడువులోగా రెండో డోస్‌ తీసుకోవాలి. స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష.

(The above story first appeared on LatestLY on Dec 18, 2021 11:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).