Why Lord Krishna Married 16000 Wives? శ్రీకృష్ణుడు 16 వేల మంది గోపికలను ఎందుకు పెళ్ళి చేసుకున్నాడో తెలుసా ? పురాణాల కథనం ఇదిగో..
ద్వాపర యుగంలో శ్రీ మహా విష్ణువు కృష్ణుడి రూపంలో పుడమిపై జన్మించాడు. శ్రీ కృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని రక్షించడానికి అనేక రకాల కృషి చేశాడు. మనిషి ధర్మం కోసం జీవించాలని శ్రీ కృష్ణుడు గీతలో అర్జునుడికి వివరించాడు. మనిషి తన జీవితాన్ని ఎలా గడపాలో పూర్తి జ్ఞానాన్ని ఇచ్చాడు
ద్వాపర యుగంలో శ్రీ మహా విష్ణువు కృష్ణుడి రూపంలో పుడమిపై జన్మించాడు. శ్రీ కృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని రక్షించడానికి అనేక రకాల కృషి చేశాడు. మనిషి ధర్మం కోసం జీవించాలని శ్రీ కృష్ణుడు గీతలో అర్జునుడికి వివరించాడు. మనిషి తన జీవితాన్ని ఎలా గడపాలో పూర్తి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇక శ్రీ కృష్ణుడు 16,000 మంది గోపికలను పెళ్లి చేసుకున్నాడనే విషయం పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ కథలోకి వెళ్తే..
పురాణాల ప్రకారం నరకాసురుడు చాలా మంది రాజులను ఓడించి, వారి కుమార్తెలను బంధించి, ఆ 16,000 మంది గోపికలను జైలులో పెట్టాడు. అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా యుద్ధం చేసి నరకాసురుడిని సంహరించి 16,000 మంది గోపికలను చెర నుండి విడిపించాడు. అయితే అప్పటికే నరకాసురుడు చాలా మంది బాలికల కుటుంబాలను చంపాడు. మిగతా బాలికల కుటుంబ సభ్యులు వారు ఇంటిలోనికి రావడానికి నిరాకరించి వారిని విడిచిపెట్టారు.
అప్పుడు ఆ అమ్మాయిలందరూ శ్రీ కృష్ణ భగవానుని అభ్యర్థించారు. మీరు మా ప్రాణాలను కాపాడారు, కానీ ఇప్పుడు మేము ఒంటరిగా ఎక్కడికి వెళతాము అని. దాంతో శ్రీకృష్ణుడు ఆ అమ్మాయిలందరి గౌరవాన్ని కాపాడటానికి 16 వేల రూపాలలో కనిపించి వారిని వివాహం చేసుకున్నారు. ఇక శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది రాణులు ఉన్నారు. వీరి పేర్లు రుక్మణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రబింద, సత్య, భద్ర, లక్ష్మణ.
(The above story first appeared on LatestLY on Oct 28, 2024 11:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

